శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం

రెండు లారీల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు..ఎక్కడ?

గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని ఎడ్లపాడు మండలం సొలస నుంచి వెళుతున్న రెండు లారీల అక్రమ రేషన్ బియ్యాన్ని గుంటూరు సమీపంలోని ఏటుకూరు వద్ద ఆదివారం లాలాపేట సీఐ పట్టుకున్నారు.

రెండు లారీల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసామని సిఐ తెలిపారు. అక్రమ రేషన్ బియ్యాన్ని లోడ్ చేసి ఎడ్లపాడు మండలం సొలస నుంచి తీసుకువస్తున్నట్లు లాలాపేట సిఐ తెలిపారు.

సురేందర్ రెడ్డి, మురళీకృష్ణా రెడ్డి ఇంకో వ్యక్తి ఉన్నట్లు, వీరితోపాటు డ్రైవర్లు మరో ఇద్దరు ఉన్నట్లు వీరిపై కేసు నమోదు చేసినట్లు లాలాపేట సిఐ అన్నారు.