గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 ఏప్రియల్ 2024 (10:33 IST)

పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణకు బిగ్ షాక్.. ఏం జరిగింది?

ysrcp flag
పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణకు బిగ్ షాక్ ఇచ్చింది ఈసీ. అంబటి మురళీకృష్ణపై కేసు నమోదైంది. ఈ నెల 13వ తేదీన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తూ పొన్నూరు పట్టణంలో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాపై తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. 
 
నాలుగు రోజుల క్రితమే పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీ కృష్ణ సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంచినట్లు కూడా నిర్ధారించారు. దీంతో చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్‌కు సీఈవో ఆదేశాలు జారీ చేశారు. అది వారం రోజులు గడవక ముందే మరోసారి అంబటి మురళిపై చర్యలకు ఆదేశించింది ఎన్నికల కమిషన్. దీంతో వైసీపీ అభ్యర్థి అంబటి మురళీ కృష్ణ నామినేషన్ దాఖలు చేయలేకపోయారు.