మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 2 డిశెంబరు 2020 (06:10 IST)

పూజలందుకున్న వానరం

నందిగామ పట్టణంలోని రమణ కాలనీ దాటిన తరువాత కండ్రిక ఆంజనేయ స్వామి వారి విగ్రహం వద్ద  విశేష పూజలు నిర్వహించారు.

ఆలయ ప్రధాన అర్చకులు రంగాచార్యులు, కృష్ణమాచార్యులు  పూజలు నిర్వహిస్తుండగా ఎటు నుంచి వచ్చిందో తెలియదు కానీ ఒక వానర వచ్చి హనుమాన్ విగ్రహంపై కుర్చుని పూజలు అయ్యేంతవరకు అక్కడే ఉండటంతో భక్తులు ఆంజనేయ స్వామి వచ్చి పూజలందుకున్నట్లుగా భావించి పరవశించిపోయారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ.. ఎంతో మహిమగల ఆంజనేయ స్వామి విగ్రహం కండ్రికలో ఉందని, కోరిన కోరికలు తీర్చే స్వామిగా ఇక్కడ స్వామి ప్రసిద్ధి అని, ప్రతి మంగళవారం స్వామివారికి విశేష పూజలు చేయడం జరుగుతుందని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని 108 ప్రదర్శనలు చేసి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారని, కోరిన కోరికలు తీర్చే స్వామిగా నందిగామ పరిసర ప్రాంత ప్రజల నమ్మకం అని తెలిపారు.