మోదీ వచ్చి.. రాజా.. నిన్ను రాజ్యసభకు పంపిస్తానని చెప్పినా.. జగన్‌కే ప్రచారం చేస్తా: పోసానీ

శనివారం, 29 జులై 2017 (20:00 IST)

posani krishnamurali

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా తన వద్దకు వచ్చి.. నాయనా.. రాజా.. పోసానీ.. నువ్వు బీజేపీ తరపున ప్రచారం చేస్తే నిన్ను రాజ్యసభకు పంపిస్తానని చెప్పినా.. తాను మాత్రం వైకాపా చీఫ్ జగన్‌కి ప్రచారం చేస్తానని ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి అన్నారు.

తనను ఎవరు ప్రలోభపెట్టినా.. ఏం చేసినా, డబ్బు, పదవి ఏమిస్తానన్నా.. తన ఓటు మాత్రం వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డికేనని... జగన్‌కే ప్రచారం చేస్తానని చెప్పారు. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత తిరుగుండదని, తన వ్యక్తిత్వమే అలాంటిదని పోసాని తెలిపాడు. పదవి ఇస్తానని జగన్ ఆఫర్ చేసినా తనకు అక్కర్లేదని స్పష్టం చేశాడు. జగన్ పోటీ చేయమన్నా చేయనని పోసాని స్పష్టం చేశాడు. 
 
ఒక టీవీ ఛానెల్‌తో మాట్లాడిన సందర్భంగా గతంలో ప్రజారాజ్యం తరపున పోటీ చేయాలని చిరంజీవి అడిగినట్టు పవన్ కల్యాణ్ అడిగితే ఏం చేస్తారని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు పోసాని సమాధానమిచ్చాడు. తన మాటకు తిరుగులేదని.. మాట మారుస్తాననే డౌట్ వుంటే.. తన మాటలు రికార్డు చేసి పెట్టుకోవాలని సూచించాడు. ఎవరేమీ చెప్పినా జగన్‌కే తన సపోర్ట్ అంటూ పోసాని వ్యాఖ్యానించాడు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

లైంగిక వేధింపులే అలవాటు.. వాకింగ్‌కు వెళ్లే మహిళలే టార్గెట్..

లైంగికంగా మహిళలను వేధించడమే పనిగా పెట్టుకున్నాడు. ఓ మహిళను కిడ్నాప్, అత్యాచారం చేసిన ...

news

అచ్చెన్నాయుడు ఎత్తుగా పెరిగారే కానీ బుర్ర ఉందో లేదో? ఎవర్ని చెప్పుతో కొట్టాలి?: రోజా

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మంత్రి అచ్చెన్నాయుడుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కులం ...

news

పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధానిగా షాహిద్ అబ్బాసీ ఖాకస్‌: సరిహద్దుల్లో భద్రత పెంచాల్సిందేనా?

పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధానిగా షాహిద్ అబ్బాసీ ఖాకస్‌ ఎంపికయ్యారు. పార్టీ సమావేశంలో షాహిద్ ...

news

పాకిస్థాన్‌లో ఫేస్‌బుక్‌పై నిషేధం...

పాకిస్థాన్‌లో ఫేస్‌బుక్‌పై నిషేధం విధించనుంది. దైవ దూషణ, చట్ట విరుద్ధ వ్యాఖ్యలు వేగంగా ...