శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 30 నవంబరు 2018 (08:33 IST)

ప్రేయసిని సుబాబుల్ తోటలోకి తీసుకెళ్లిన ప్రియుడు.. అత్యాచారం చేసిన ఇద్దరు యువకులు

తన ప్రియురాలితో ఏకాంతంగా గడపాలన్న ఉద్దేశ్యంతో ఆమెను రాత్రిపూట గ్రామ సమీపంలో ఉన్న సుబాబుల్ తోటలోకి తీసుకెళ్లాడు ప్రియుడు. ఈ విషయాన్ని గమనించిన ఇద్దరు యువకులు.. ప్రియుడుని కట్టేసి ఆ యువతిపై ప్రియుడి కళ్లముందే అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా అద్దంకిలో వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, అద్దంకి మండలంలోని బలరామకృష్ణాపురానికి చెందిన ఓ యువతి, ఓ యువకుడు ప్రేమించుకున్నారు. ఫలితంగా వీరిద్దరూ అత్యంత సన్నిహితంగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలో తన ప్రియురాలితో ఏకంగా గడపాలన్న ఉద్దేశ్యంతో గ్రామ శివారుల్లో ఉన్న సుబాబుల్ తోటలోకి స్కూటీపై వెళ్లారు. 
 
ఇది గమనించిన ఇద్దరు యువకులు మోటార్ సైకిల్‌పై వారిని అనుసరించారు. రాత్రి సమయం పైగా చీకటిగా ఉండటంతో ఈ ఇద్దరు యువకులను ఆ ప్రేమ జంట గమనించలేదు. సుబాబుల్ తోటలోకి వెళ్లాక ప్రియుడుని కట్టేసి ఆ యువతిపై అత్యాచానికి పాల్పడ్డారు. 
 
అయితే, ఆ కామాంధుల చెరనుంచి తప్పించుకునేందుకు ఆ బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో అటుగా వెళుతున్న బాటసారులు ఆ కేకలు విని పరుగెత్తుకుంటూ వచ్చారు. దీంతో ఇద్దరు కామాంధులు పారిపోయారు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కానీ గ్రామంలో మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.