PRC రగడ, జీతాలు-పెన్షన్లు ఇంతవరకూ ప్రాసెస్ కాలేదు, ఫిబ్రవరి పరిస్థితి ఏంటో?
ఏపీలో PRC రగడ సాగుతూ వుంది. ఈ వ్యవహారం కాస్తా ఫిబ్రవరి నెలలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలపై పడే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాలు, పెన్షన్ల బిల్లులకు సంబంధించి ఏపీ ఆర్థిక శాఖ సర్క్యూలర్ జారీ చేసిన కొత్త పే స్కేల్ ప్రకారం అమలు చేయాలని తెలిపింది. ఐతే ట్రెజరీ అధికారులు చీమకుట్టినట్లయినా స్పందించలేదు.
పీఆర్సీ సమస్య పరిష్కారం వచ్చేవరకూ కొత్త పే స్కేల్ తీసుకునేది లేదని ఉద్యోగ సంఘాలు చెపుతున్నాయి. ఐతే ఒకసారి పీఆర్సీపై జీవో జారీ చేసిన ప్రభుత్వం దాని ప్రకారం జీతాలు తీసుకోవాలని సూచిస్తోంది. దీనిపై ఉద్యోగులు చేస్తున్న వ్యవహారంపై ప్రభుత్వం ఆగ్రహంగా వున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు పంపిన సర్క్యూలర్ ప్రకారం ట్రెజరీ అధికారులు స్పందించకుంటే ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.