గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 డిశెంబరు 2022 (11:53 IST)

పాలనా రాజధానికి రూట్ మ్యాచ్ సిద్ధం .. త్వరలో వైజాగ్ నుంచి పాలన : మంత్రి బొత్స

botsa
పాలనా రాజధానికి రూట్ మ్యాప్ ఖరారైందని, త్వరలోనే విశాఖపట్టణం నుంచి పాలన సాగిస్తామని ఏపీ మంత్రి, వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగానే విశాఖను పాలనా రాజధానిని చేస్తున్నామని, ఇందుకోసం ఏర్పాట్లు కూడా శరవేగంగా సాగుతున్నాయని చెప్పారు. 
 
విజయనగరంలో జరిగిన వైకాపా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, భోగాపురం విమానాశ్రయం పనులకు జరవరిలో శంకుస్థాపన చేస్తామని తెలిపారు. కొందరు ఎమ్మెల్యేలు ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు ఫోన్లు చేస్తే తీయడం లేదని, ఈ పద్ధతి మారాలన్నారు. 
 
మరో వైకాపా నేత వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నోరు విప్పితే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. గత 2014 నుంచి 2016 వరకు రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి పని కూడా చేపట్టలేదని ఆయన అన్నారు. అందుకే గత ఎన్నికల్లో ఆయన్ను తిరస్కరించారని చెప్పారు.