ఎంపీ గోరంట్ల మాధవ్ డర్టీ వీడియోపై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం
ఏపీలోని హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ "డర్టీ వీడియో"పై రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనేకాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ వీడియో కేసులో మాధవ్‌పై చర్యలు తీసుకోవాలని రాష్ట్రానికి చెందిన మహిళా జేఏసీ నేతలు ఇటీవల జాతీయ స్థాయిలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. ఈ ఫిర్యాదును ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యాదర్శి సమీర్ శర్మకు పంపించింది. అలాగే, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది.
ఇదిలావుంటే, గోరంట్ల మాధవ్ డర్టీ వీడియో అంశంపై మహిళా బీజేపీ నేతలు మాధవ్‌పై చర్యలు తీసుకునేలా చూడాలని రాష్ట్రపతిని కోరారు. అటు ఉపరాష్ట్రపతి, జాతీయ మహిళా కమిషన్, పలువురు కేంద్ర మంత్రులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించిందని జేఏసీ కన్వీనర్ చెన్నుపాటి కీర్తికి రాష్ట్రపతి కార్యాలయం ఓ లేఖ పంపించింది.