Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బుర్రలేని ఎమ్మెల్యేలు... బ్యాలెట్ పేపరుపై పేర్లు - సంతకాలు

సోమవారం, 17 జులై 2017 (16:01 IST)

Widgets Magazine
ballot box

రాష్ట్రపతి ఎన్నిక కోసం సోమవారం దేశవ్యాప్తంగా పోలింగ్ జరిగింది. ఆయా రాష్ట్రాల రాజధానుల్లో ఉన్న అసెంబ్లీ ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో ఓటును ఎలా వేయాలో కూడా మాక్ పోలింగ్ పేరుతో ప్రజాప్రతినిధులకు రెండుమూడు దఫాలుగా వివరించారు. అయినాసరే మన బుర్రలేని ఎమ్మెల్యేల చెవికెక్కలేదు. 
 
ఈకాలంలో ఏమీ తెలియని నిరక్ష్యరాస్యుడు సైతం ఈవీఎంలలోనే కాకుండా, బ్యాలెట్ పత్రాల ద్వారా కూడా తన ఓటు హక్కును స్పష్టంగా వినియోగించుకుంటున్నాడు. కానీ, ఓటర్లు వేసిన ఓట్లతో గెలుపొందిన ప్రజాప్రతినిధులకు మాత్రం ఓటును ఎలా వినియోగించుకోవాలో తెలియదనే విషయం సోమవారం జరిగిన రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ ద్వారా బహిర్గతమైంది. 
 
తెలంగాణ ప్రాంతానికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తన ఓటు వేసిన బ్యాలెట్ పత్రం ఎక్కడ వేయాలో తెలియలేదు. బ్యాలెట్ పత్రాన్ని చేతిలో పట్టుకుని.. ఆ సమయానికి పోలింగ్ కేంద్రంలో ఉన్న మంత్రి హరీష్ రావు వద్దకు వెళ్లి బ్యాలెట్ పత్రం ఎక్కడ వేయాలంటూ అడగడంతో ఆయన ఆశ్చర్యపోయారు. 
 
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార టీడీపీ ఎమ్మెల్యేల విషయానికి వస్తే... బ్యాలెట్ పత్రాలపై తమ పేర్లు రాయడమే కాకుండా, ఏకంగా సంతకాలు కూడా చేశారట. వీరిలో జితేందర్ గౌడ్, కదిరి బాబూరావులు ఉన్నారట. వీరిద్దరూ బ్యాలెట్ పేపరుపై ఒకటో నంబరు వేయడంతో పాటు.. తమ పేరు కూడా రాశారట. ఈ విషయం తెలిసిన చంద్రబాబు ఆ ఇద్దరికి క్లాస్ పీకినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, ఇపుడు ఈ ఓట్లు చెల్లుతాయో లేదో తెలియాల్సి ఉంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయని సచిన్ - నటి రేఖ

రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలో భాగంగా సోమవారం దేశ వ్యాప్తంగా పోలింగ్ జరిగింది. ఈ ...

news

బ్యాలెట్ పేపర్ ఎక్కడ వేయాలో తెలియని తెరాస ఎమ్మెల్యే.. క్లాస్ పీకిన హరీష్

రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలో భాగంగా సోమవారం పోలింగ్ దేశవ్యాప్తంగా జరిగింది. ...

news

స్వీటీని చూసి సంబరపడిపోయిన తెలంగాణ సీఎం కేసీఆర్...

స్వీటీని చూసి తెలంగాణ ముఖ్యమంత్రి సంబరపడిపోయారు. స్వీటి అనగానే బాహుబలి అనుష్క ...

news

అలా అయితే.. ఎన్నికల్లో పోటీ చేయనంటున్న వైకాపా ఫైర్‌బ్రాండ్‍!

ఆర్కే. రోజా. సినీనటి. ప్రస్తుతం వైకాపా తరపున నగరి శాసనసభ సభ్యురాలు. ఆమె పేరు వింటేనే ...

Widgets Magazine