శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 13 జులై 2018 (12:07 IST)

దేవుడు చెప్పాడనీ... గర్భగుడిలో యువతితో పూజారీ...

ఆలయానికి వచ్చిన ఓ మహిళా భక్తురాలి పట్ల పూజారి అసభ్యంగా నడుచుకున్నాడు. తనకు దేవుడు కలలో కనిపించాడనీ చెప్పి.. గర్భగుడిలోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ తర్వాత మనమిద్దరం పెళ్లి చేసుకుందామంటూ ఒత్త

ఆలయానికి వచ్చిన ఓ మహిళా భక్తురాలి పట్ల పూజారి అసభ్యంగా నడుచుకున్నాడు. తనకు దేవుడు కలలో కనిపించాడనీ చెప్పి.. గర్భగుడిలోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ తర్వాత మనమిద్దరం పెళ్లి చేసుకుందామంటూ ఒత్తిడిచేశాడు. దీంతో ఆ మహిళ బెంబేలెత్తిపోయి కేకలు వేస్తూ గర్భగుడి నుంచి బయటకు పరుగులు తీసింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా మానేరు బైపాస్ రోడ్డులో జరిగింది.
 
మానేరు బైపాస్‌ రోడ్డులో ఉన్న ఓ దేవాలయంలో వెంకటరెడ్డి (55) అనే వ్యక్తి సుమారు దశాబ్దకాలంగా పూజారిగా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం 25 యేళ్ల ఓ యువతి గుడికి వచ్చింది. ఆమెతో మాటామాటా కలిపి.. తనకు దేవుడు కలలో కనిపించాడనీ, మనమిద్దరం పెళ్లి చేసుకుందామంటూ గర్భగుడిలోకి తీసుకెళ్లాడు. అక్కడ అసభ్యంగా ప్రవర్తిస్తూ మెడలో పసుపుతాడు కట్టేందుకు ప్రయత్నించాడు. దీంతో.. కంగారుపడిపోయిన యువతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకి విషయం చెప్పింది. 
 
దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు గుడికి వెళ్లి ప్రశ్నించగా.. 'అవును.. నాకు దేవుడు కలలో కనిపించి.. ఆమెని పెళ్లి చేసుకోమన్నాడు' అని చెప్పాడు. దీంతో.. కోపద్రిక్తులైన బంధువులు అతడ్ని చితకబాదారు. యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కరీంనగర్ ఒకటో పట్టణ పోలీసులు వెల్లడించారు.