బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

రాజమండ్రి సెంట్రల్ జైలులో ఖైదీ మృతి.. చంద్రబాబు భద్రతపై ఆందోళనలు

deadbody
రాజమహేంద్రవరంలోని కేంద్ర కారాగారంలో చంద్రబాబు భద్రతపై ఆందోళన నెలకొంది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సీబీఐ కోర్టుకు కూడా వెల్లడించారు. తాజాగా ఈ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ అనారోగ్య సమస్యతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీనికంటే ముందుగా.. ఓ ఖైదీ డెంగ్యూ జ్వరంతో చనిపోయిన విషయం తెల్సిందే. ఈపరిస్థితుల్లో ఇపుడు మరో ఖైదీ చనిపోవడంతో ఇదే జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు భద్రతపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. 
 
పోలీసులు, జైలు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం మురమండ గ్రామానికి చెందిన జోబాబు (55) అనే వ్యక్తి ఓ హత్య కేసులో 2002లో జీవితఖైదు శిక్ష పడింది. దీంతో 23-10-2002 నుంచి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నాడు. గత నెల 28న హైబీపీ వచ్చి ఆయన పడిపోవడంతో జైలు ఆసుపత్రి వైద్యుల సూచన మేరకు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 
 
అక్కడ పరీక్షించిన వైద్యులు హెచ్ఐఎన్, న్యూరాలజీ సమస్యతో అతడు బాధపడుతున్నట్లు గుర్తించారు. అనంతరం నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ ప్రాథమిక చికిత్స చేయించిన తర్వాత మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. జోబాబు పక్షవాతంతో ఆసుపత్రిలో చేరాడని, నరాల సంబంధిత రుగ్మతలు, శ్వాస సంబంధిత వ్యాధుల కారణంగా గుండెపోటు వచ్చి చనిపోయాడని జీజీహెచ్ వైద్యులు తెలిపారు. 2008 నుంచి ఓపెన్ జైలులో ఉండే ఇతను జైళ్లశాఖ పెట్రోల్ బంకులో పనిచేసేవాడు.