శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 సెప్టెంబరు 2021 (09:29 IST)

ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యుడు డాక్టర్ ఎంవీ రమణారెడ్డి కన్నుమూశారు. ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కర్నూలు ఆస్సత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. 
 
గతంలో ఎన్టీఆర్‌ను విభేదించి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన రమణారెడ్డి రాయలసీమ విమోచన సమితిని ఏర్పాటు చేశారు. నిరంతరం రాయలసీమ హక్కుల కోసం పరితపించిన ఆయనకు పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలియజేస్తున్నారు.
 
రమణారెడ్డి మృతిపట్ల తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రమణారెడ్డి రచయిత, గొప్ప మేధావి అంటూ కొనియాడారు. ఎంవీ రమణారెడ్డి మృతిపట్ల సీనియర్‌ జర్నలిస్ట్‌ తెలకపల్లి రవి సంతాపం తెలిపారు.