శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 1 నవంబరు 2021 (15:05 IST)

నౌకాదళంలోకి ‘పీ15బి’ తొలి నౌక

భార‌త అమ్ముల పొదిలో మ‌రో ఆయుదం చెరింది. దేశ భద్రత కోసం కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ప్రాజెక్టు15బి (పీ15బి) పేరిట నిర్మించిన తొలినౌక భారత నౌకాదళంలో చేరింది. ముంబయి మజగాన్‌ డాక్‌లో అక్టోబరు 28న నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో తయారీ సంస్థ ప్రతినిధులు భారత నౌకాదళ అధికారులకు నౌక అప్పగింత పత్రాలను అందజేశారు. 
 
 
పీ15బి పేరిట నాలుగు నౌకల నిర్మాణానికి మజగాన్‌ డాక్‌ షిప్‌ బిల్డర్స్‌ (ముంబయి) సంస్థ గతంలోనే ఆర్డర్లు దక్కించుకుంది. ఈనౌక 163 మీటర్ల పొడవుతో 30 నాటికళ్ల వేగంతో ప్రయాణం చేయగలదని నేవీ వర్గాలు తెలిపాయి. ఉపరితలం నుంచి (మిసైల్స్‌) గాలిలోకి, ఉపరితలం నుంచి (బ్రహ్మోస్‌) ఉపరితలానికి, టార్పెడో ట్యూబ్‌ లాంచర్లు, రాకెట్‌ లాంచర్లు, సూపర్‌ ర్యాపిడ్‌ తుపాకులు కలిగి ఉండటం ఈ నౌక ప్రత్యేకత అని నేవీ వర్గాలు వివరించాయి. ఇది శ‌త్రువుల‌కు దుర్బేధ్యం అని నీటి నుంచి గ‌గ‌న త‌లానికి, నీటిలో నుంచి, నీటిలోకి యుద్ధ ప్ర‌క్రియ‌లు దీని ద్వారా నిర్వ‌హించ‌వ‌చ్చ‌ని అధికారులు వివ‌రిస్తున్నారు.