శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 9 డిశెంబరు 2021 (14:51 IST)

జనరల్ బిపిన్ లక్ష్మణ్ రావత్ బృందానికి నివాళి

భారతం దేశ త్రివిధ దళాల అధిపతి సి డి ఎస్ జనరల్ బిపిన్ లక్ష్మణ్ రావత్, ఆయ‌న సతీమణి, మ‌రో 12  మంది సైనిక అధికారులు హెలికాప్టర్ ప్రమాదంలో చ‌నిపోవ‌డంతో దేశ ప్ర‌జ‌లంతా వారికి నివాళులు అర్పిస్తున్నారు. ప్రాణాల్ని కోల్పోయిన సైనికుల ఆత్మ శాంతించాలని భారతీయ జనతా పార్టీ రాజమండ్రి రూరల్ మండల సభ్యులు సంతాపాన్ని వ్యక్తం చేశారు


బొమ్మూరు సెంటర్ లో వారి చిత్రపటానికి పూలమాల వేసి కొద్ది సేపు మౌనం వహించి శ్రద్ధాంజలి ఘటించారు. మండల అధ్యక్షుడు యానాపు ఏసు, జిల్లా ఉపాధ్యక్షులు ఒంటెద్దు స్వామి మాట్లాడుతూ, దేశం ఒక సైనికాధికారిని, ఆయ‌న బృందాన్ని  కోల్పోవడం చాలా దురదృష్టకరమైన సంఘటన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రాల వెంకట్, రూరల్ ఇంచార్జ్ కాలేపు సత్య సాయిరాం, మండలం ప్రధాన కార్యదర్శి ఎన్.వి.బి.ఎన్. ఆచారి, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ రామకృష్ణ, పిచ్చుక వెంకట రాంబాబు, మల్లాడి సత్య వరప్రసాద్, ముద్రగడ సూర్య చంద్ర మోహన్, రొంగల శ్రీను,  త‌దితరులు పాల్గొని నివాళులు అర్పించారు.
 
 
రాజమండ్రి నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సైనిక దళాల కమాండర్ బిపిన్ రావత్, ప్రమాదంలో మరణించిన ఆయన సహచర సైనిక  ఉద్యోగులకు సంతాప కార్యక్రమం నిర్వహించారు. బిపిన్ రావ‌త్  దేశానికి అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, కార్యదర్శి  బెజవాడ రంగ, నగర ఉపాధ్యక్షులు చింతాడ వెంకటేశ్వర, ఎస్సీసెల్ నాయకులు బత్తిన చందర్రావు,  మహిళా నాయకురాళ్లు చామర్తి లీలావతి,  ఇజ్జారౌతు విజయలక్ష్మి  తదితరులు పాల్గొన్నారు.