కాలిఫోర్నియాలో గ‌ల్లంతైన న‌రేష్ మృత‌దేహం ల‌భ్యం...

అమెరికాలోని కాలిఫోర్నియాలో బోట్ షికారుకు వెళ్లి న‌దిలో గ‌ల్లంతైన విద్యార్థి న‌రేష్ చివ‌రికి శ‌వ‌మై తేలాడు. అత‌ని మృత‌దేహాన్ని డెల్ వ్యాల్ రీజనల్ పార్క్ లివర్ మోర్ నది నుంచి పోలీసులు వెలికితీశారు. నిన్న అంతా న‌దిలో వెతికిన కాలిఫోర్నియా ప

student
JSK| Last Modified మంగళవారం, 21 జూన్ 2016 (17:21 IST)
అమెరికాలోని కాలిఫోర్నియాలో బోట్ షికారుకు వెళ్లి న‌దిలో గ‌ల్లంతైన విద్యార్థి న‌రేష్ చివ‌రికి శ‌వ‌మై తేలాడు. అత‌ని మృత‌దేహాన్ని డెల్ వ్యాల్ రీజనల్ పార్క్ లివర్ మోర్ నది నుంచి పోలీసులు వెలికితీశారు. నిన్న అంతా న‌దిలో వెతికిన కాలిఫోర్నియా పోలీసులు... వెత‌క‌డం క‌ష్టం అని చేతులు ఎత్తేశారు. ఈ రోజు ఎట్ట‌కేల‌కు మృత‌దేహాన్ని క‌నుగొన్నారు. దీనితో న‌రేష్ బ‌తికున్నాడ‌నే ఆశ ఆవిరై... చ‌నిపోయాడ‌ని తెలిసి త‌ల్లితండ్రులు గుండెలవిసేలా ఇక్క‌డ ఏడుస్తున్నారు.

పుట్టా నరేష్ అమెరికా కాలిఫోర్నియా డెల్ వ్యాల్ రీజనల్ పార్క్ లివర్ మోర్ నదిలో ఆదివారం బోట్ షికారుకు వెళ్ళాడు. ఇంకా 100 మీటర్ల దగ్గరలో ఒడ్డుకు చేరుతామనగా, ప్ర‌మాద‌వ‌శాత్తు బోటు నుంచి ముగ్గురు నీటిలో పడిపోయారు. ఇద్దరిని కాపాడిన వారు నరేష్‌ను కాపాడలేకపోయారు. నదిలో నరేష్ పడిన చోట చెత్త బాగా పేరుకుపోయి ఉండటంతో చెత్తలో కూరుకుపోయి ఆచూకీ గల్లంతయ్యింది. న‌రేష్ మృత‌దేహాన్ని కాలిఫోర్నియా నుంచి ఇండియాకు తెచ్చేందుకు విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు.

క‌ష్ణా జిల్లాకు చెందిన ఎమ్మెస్సీ విద్యార్థి పుట్టా నరేష్ గల్లంతు వార్త అత‌ని త‌ల్లిదండ్రుల‌కు తీవ్ర మ‌న‌స్తాపాన్ని క‌లిగించింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం బండిపాలెం గ్రామంలో పేద కుటుంబానికి చెందిన పుట్టా నరేష్ నందిగామలో డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్ కృష్ణారెడ్డి కళాశాలలో ఎంసీఎ చ‌దివాడు. 2015 జనవరిలో ఎమ్మెస్ చదివేందుకు అమెరికా వెళ్ళాడు. పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ, కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ సెకండియర్ చదువుతున్నాడు. జ‌గ్గయ్యపేట మండలం బండిపాలెంలో నరేష్ ఇంటి వద్ద విషాద ఛాయ‌లు నెల‌కొన్నాయి.దీనిపై మరింత చదవండి :