గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 13 ఆగస్టు 2021 (12:22 IST)

శ్రీవారి సేవలో పీవీ సింధు - తీర్థప్రసాదాలు అందజేత

భారత బ్యాడ్మింటన్ స్టార్, టోక్యో ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధు శుక్రవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆమె తన కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు, స్వామి వారి చిత్ర పటాన్ని అర్చకులు ఆమెకు అందజేశారు. అలాగే, మరో వీఐపీ చాముండేశ్వరినాథ్ కూడా ఉన్నారు. 
 
ఇదిలావుంటే, పీవీ సింధుతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నేత విష్ణువర్ధన్‌ రెడ్డి తదితర వీఐపీలు శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.