మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 25 ఆగస్టు 2021 (10:49 IST)

బీజేపీకి ఫైనాన్షియ‌ల్ మేనేజ్మెంట్ రాదు: రాహుల్ గాంధీ

ఎంత‌టి విప‌త్క‌ర ప‌రిస్థితిని అయినా, కాంగ్రెస్ ప్ర‌భుత్వం త‌ట్టుకుని ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ను చ‌క్క‌దిద్ద‌గ‌ల‌ద‌ని కాంగ్రెస్ యువ‌నేత రాహుల్ గాంధీ చెప్పారు. బీజేపీకి ఆ అనుభ‌వం, నేర్పు లేవ‌ని, ఫైనాన్షియ‌ల్ మేనేజ్ మెంట్ వాళ్ళ‌కు తెలియ‌ని విద్య అని ఎద్దేవా చేశారు.
 
ప్రైవేటీకరణకు కాంగ్రెస్‌ ఎప్పుడూ వ్యతిరేకం కాదని ఆ పార్టీ కీలక నాయ‌కుడు రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. హేతుబద్ధత లేని ప్రైవేటీకరణకే కాంగ్రెస్‌ వ్యతిరేకమని పేర్కొన్నారు. రైల్వే వంటి వ్యూహాత్మక రంగాలను కాంగ్రెస్ ఎపుడూ ప్రైవేటీకరించ లేదన్నారు. నష్టాలు తెచ్చే పరిశ్రమలను కాంగ్రెస్‌ ప్రైవేటీకరించింది తప్పితే, గుత్తాధిపత్యానికి దారితీసేలా చర్యలు చేపట్టలేదన్నారు. బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌ను నాడు జాతీయ‌క‌ర‌ణ చేయడం ద్వారా ఇందిరాగాంధీ పెద్ద ఆర్ధిక విప్ల‌వ‌మే సృష్టించార‌న్నారు.
 
ఇపుడు మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్‌ ప్రతి ఒక్కటీ అమ్మేయాలని చూస్తోందని, ఆర్థిక వ్యవస్థ నిర్వహించే తీరు భాజపాకు తెలియదని రాహుల్ గాంధీ విమర్శించారు.