శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (15:34 IST)

పండుగ సీజన్‌లో ప్రత్యేక రైళ్లు : దక్షిణ మధ్య రైల్వే

దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సరం సందర్భంగా నగరం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఈ మేరకు సీపీఆర్వో రాకేశ్ ఒక ప్రకటన విడుదల చేశారు. కాచిగూడ నుండి.. పండుగల కోసం కాచిగూడ నుండి 26 రైళ్లను శ్రీకాకుళం రోడ్ స్టేషన్‌కు నడుపనున్నారు.
 
అలాగే, అక్టోబరు 6వ తేదీ నుండి డిసెంబర్ 29వ తేదీ వరకు ప్రతీ ఆదివారం, మంగళవారం సాయంత్రం కాచిగూడ స్టేషన్ నుంచి 6.45 నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.55 గంటలకు రాయపాడు మీదుగా శ్రీకాకుళం రోడ్‌కు చేరనుంది. 
 
అదేవిధంగా శ్రీకాకుళం రోడ్ నుంచి కాచిగూడ స్టేషన్‌కు అక్టోబర్ 7 నుంచి డిసెంబర్ 30 వరకు ప్రతీ సోమవారం సాయంత్రం 5.15 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది. అదేవిధంగా ఇదేమార్గంలో మరో 14 ప్రత్యేక రైళ్లను ఆపరేట్ చేయనున్నారు. శ్రీకాకుళం రోడ్డు నుంచి తిరుపతి శ్రీకాకుళం రోడ్డు నుండి తిరుపతికి కూడా మరో 14 ప్రత్యేకరైళ్లను నడిపించనున్నారు. 
 
అక్టోబర్ 2 నుండి జనవరి 1, 2020 వరకు ప్రతీ బుధవారం సాయంత్రం 4.30 గంటలకు శ్రీకాకుళం రోడ్డు నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.25 గంటలకు చేరుకుంటాయి. కాచిగూడ- తిరుపతి స్పెషల్ అదేవిధంగా కాచిగూడ నుంచి తిరుపతి మధ్య 14 ప్రత్యేక రైళ్లను దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. 
 
అక్టోబరు 3 నుంచి జనవరి 2, 2020 వరకు ప్రతీ గురువారం సాయంత్రం 5 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు కాచిగూడకు చేరుకుంటాయి. కరీంనగర్ నుంచి తిరుపతికి 80 స్పెషల్ రైళ్లు దసరా, దీపావళితో పాటు శీతాకాలాన్ని పురస్కరించుకుని కరీంనగర్ నుంచి తిరుపతికి వారానికి 3 రైళ్ల చొప్పున 80 ప్రత్యేక రైళ్లు నడిపించాలని నిర్ణయించారు. 
 
అక్టోబరు ఒకటో తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు ప్రతీ ఆది, మంగళ, గురువారాలలో తిరుపతి నుంచి రాత్రి 10.40 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 10.55 గంటలకు కరీంనగర్‌కు చేరుకుంటాయి. అదేవిధంగా అక్టోబర్ 2 నుంచి జనవరి 1,2020 వరకు సోమ, బుధ, శుక్రవారాలలో సాయంత్రం 7.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.10 గంటలకు తిరుపతికి చేరుకుంటాయి. 
 
ఈ రైళ్లు రేణిగుంట, శ్రీకాళహస్తి, గూడూర్, విజయవాడ, మధిర, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, జమ్మికుంట, పెద్దపల్లి స్టేషన్లలో హాల్టింగ్ ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు.