శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 24 ఏప్రియల్ 2023 (11:14 IST)

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు.. ఉరుములు, పిడుగులు జాగ్రత్త

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. అకాల వర్షాల కారణంగా వేలాది ఎకరాల్లో పంట నాశనమైంది. మరోవైపు అకాల వర్షాలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో వాతావరణ శాఖ మరోసారి అలెర్ట్ ప్రకటించింది. 
 
తెలుగు రాష్ట్రాల్లో సోమవారం కూడా ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఏపీలోని ఉత్తరాంధ్ర, కోనసీమ జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని, గంటకు 30 నుంచి 40 కి.మీ.ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.  
 
ఇక తూర్పు తెలంగాణ జిల్లాల్లోనూ అక్కడక్కడ వానలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. అకాల వర్షాల నేపథ్యంలో రైతులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
 
సోమవారం సాయంత్రం నుంచి రాయలసీమలో అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఎక్కడైనా ఎపుడైనా ఉరుములు మెరుపులతో వర్షం ఉన్నప్పుడు చెట్ల కింద ఉండొద్దని.. పొలంలో పనిచేసే రైతులు జాగ్రత్తగా వుండాలని వాతావరణ శాఖ హెచ్చరిం