శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 24 జులై 2014 (15:33 IST)

బాల్ థాక్రే, మహాత్మా గాంధీల కంటే కేసీఆర్ బెటర్: రామ్ గోపాల్ వర్మ

వివాదాస్పద డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ.. ఐస్ క్రీమ్ తర్వాత మళ్లీ సీన్లోకి వచ్చాడు. అయితే ఈసారి సినిమాలపై సెన్సేషనల్ కాకుండా రాజకీయాలపై పడ్డాడు. వివాదాస్పద సినిమా, వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ.. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ట్విట్టర్ ద్వారా పలు కామెంట్లు చేశాడు. ఇవి కేసీఆర్‌ను విమర్శించినవి అనుకుంటే పప్పులో కాలేసినట్టే. 
 
ఈసారి ఆశ్చర్యంగా రామ్ గోపాల్ వర్మ కేసీఆర్‌పై ట్విట్టర్ ముఖంగా ప్రశంసల జల్లు కురిపించారు. ‘తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ బాగా పని చేస్తున్నారని నా అభిప్రాయం' అని వర్మ సందేశం పోస్టు చేశాడు.
 
అంతటితో ఆగకుండా ‘శివసేన అధ్యక్షుడు దివంగత బాల్ థాక్రే, మహాత్మా గాంధీల కంటే కెసిఆర్ బెటర్'గా పని చేస్తున్నారు' అని తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. అయితే తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తప్పుపట్టడం లేదని రామ్ గోపాల్ వర్మ క్లారిటీ కూడా ఇచ్చేశాడు.