Widgets Magazine

అపచారం.. హథీరాంజీ మఠంలో మహిళపై అత్యాచారం.. రెండుసార్లు అబార్షన్

సోమవారం, 11 డిశెంబరు 2017 (15:16 IST)

arjun dass mahantu

కలియుగ వైకుంఠంలో వెలసిన ప్రత్యక్షదైవంగా ఆ శ్రీ వేంకటేశ్వర స్వామిని కొలుస్తారు. అలాంటి స్వామి కొలువైవున్న తిరుమలగిరుల్లో ఓ మహిళపై అత్యాచారం జరిగింది. ఇలా జరగడం ఒక్కసారి కాదు. ఆ మహిళకు ఏకంగా రెండుసార్లు అబార్షన్ చేయించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పైగా, ఈ అత్యాచారానికి పాల్పడింది ఓ మహంతు కావడం గమనార్హం.
 
తిరుమల కొండపై వున్న బాబా హథీరాంజీ మఠం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మఠం మహంతుల ఆధీనంలో ఉంటుంది. ప్రస్తుతం అర్జున్ దాస్ ఈ మఠానికి అధిపతిగా ఉన్నారు. వీరు బ్రహ్మచారులుగా ఉండాలి. పెళ్ళిళ్ళు చేసుకోరాదు. మఠానికి భక్తుల వస్తూ పోతుంటారు. వారిలో మహేశ్వరీ అనే మహిళకు మాయమాటలు చెప్పి వశపరుచుకున్నట్లు ఆమె తాజాగా సంచలన ఆరోపణలు చేస్తోంది. 
 
తనకు ఇప్పటికే రెండుసార్లు అబార్షన్ చేయించారనీ ఆరోపించారు. తాను చిన్న వయస్సులో ఉండగానే పదేపదే లైంగిక దాడికి పాల్పడ్డారని, గర్భందాల్చిన తర్వాత తన చేతిలో ఓ నాలుగు వేలు పెట్టి పంపారని, తన జీవితం నాశనం చేశారని కన్నీటి పర్యంతమయ్యారు.
 
మహిళను మోసం చేసింది వాస్తవమేనని ఉద్యోగులు కూడా చెబుతున్నారు. మహంతు అర్జున్ దాస్ రౌడీలా ప్రవర్తిస్తున్నాడని, మహంతు అక్రమాలపై విచారణ జరపాలని మఠం ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, మహంతు అర్జున్ దాస్ మాత్రం ఈ వార్తలను కొట్టిపారేస్తున్నారు. తనపై కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఆ మహిళకు నాకు ఎలాంటి సంబంధం లేదని వాదిస్తున్నారు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  
Woman Rape Allegations Arjun Das Baba Tirumala Hathiramji Mutt

Loading comments ...

తెలుగు వార్తలు

news

వివాహేతర సంబంధాలు... 184 హత్యలు... ఎక్కడ?

ప్రతి ఏడాది ముగింపులో ఆయా రాష్ట్రాల్లో నేరాలు, హత్యలు గురించి గణాంకాలను ప్రకటించడం ...

news

గుజరాత్ పోల్స్ : బీజేపీ గుండెల్లో గుబులు

గుజరాత్ తొలిదశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ దశలో అధికార బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ...

news

హైదరాబాద్ మెట్రో రైళ్ళకు అనూహ్య స్పందన

హైదరాబాద్ మహానగరంలో మెట్రో రైల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సేవలకు భాగ్యనగరివాసుల నుంచి ...

news

రూ.37,54,06,23,616 ఇదీ ప్రధాని మోడీ ప్రచార ఖర్చు

దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ చాయ్ వాలా అని, ఆయన కింది స్థాయి నుంచి ప్రధాని పదవిని ...