1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 24 నవంబరు 2014 (17:52 IST)

33 మంది ఎర్ర కూలీలు అరెస్టు.. 33 దుంగలు, 8 వాహనాలు స్వాధీనం

ఎర్రచందనం దొంగలపై పోలీసులు విరుచుకుపడ్డారు. తిరుపతి పరిసర ప్రాంతాలలో జరిపిన దాడుల్లో 33 మంది ఎర్రచందనం కూలీలను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 33 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. మరో 8 వాహనాలను పట్టుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 
 
మామండూరు, కరకంబాడీ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఎర్రచందనాన్ని లారీలో భర్తీ చేసుకుని అక్రమంగా తరలించేందుకు 30 మందికిపైగా ఎర్రచందనం కూలీలు సిద్ధమవుతున్నారు. అయితే ముందుగానే సమాచారం ఉన్న పోలీసులు అమాంతం వారి దాడి చేశారు. అనుకోని ఈ సంఘటనకు ఎర్రదొంగలలో చాలా మంది పరారయ్యారు. 
 
అయితే దుంగలను భర్తీ చేసేందుకు తయారైన 16 మంది ఎర్రకూలీలు మాత్రం పోలీసుల చేతికి చిక్కారు. వారు ఎర్రచందనం భర్తీ చేయడానికి సిద్ధంగా ఉంచుకున్న ద్విచక్రవాహనాలు, కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనలో 12 దుంగలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక చంద్రగిరి ప్రాంతం నుంచి లోడుతో ఎమ్మార్ పల్లె మీదుగా అక్రమంగా ఎర్రచందనం రవాణా చేస్తున్న వాహనాలపై పోలీసులు విరుచుకుపడ్డారు. 
 
ఈ సంఘటనలో ఒక్క లారీని, కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటి నుంచి 15 పెద్ద దుంగలను 6 చిన్న దుంగలను స్వాధీన పరుచుకున్నారు. ఇక్కడ కూడా రెండు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. ఈ ఆపరేషన్ కు జిల్లా ఎస్పీ గోపినాథ్ జెట్టి ప్రణాళిక సిద్ధం చేయగా అదనపు ఎస్పీ సుబ్బారెడ్డి, టాస్క్ ఫోర్స్ డిఎస్పీ ఇలియాస్ బాషా తదితర సిఐలు పాల్గొన్నారు.