గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 19 జులై 2020 (17:18 IST)

ఫైరింజన్‌ బోల్తా- రేణిగుంట విమానాశ్రయంలో తృటిలో తప్పిన ప్రమాదం

Fire engine
రేణిగుంట విమానాశ్రయంలో ఆదివారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. రన్‌ వే పరిశీలనకు వెళ్లిన ఫైరింజన్‌ అదుపు తప్పి బోల్తా పడింది. అదే సమయంలో హైదరాబాద్‌ నుంచి రావాల్సిన ఇండిగో విమానం విమానాశ్రయ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ల్యాండింగ్‌ అయింది.

ఇంతలో ఫైరింజన్ బోల్తాపడిన విషయాన్ని గ్రహించిన అధికారులకు ఏం చెయ్యాలో తోచలేదు. విమానంలోని పైలట్లకు విషయం చెప్పారు. దీంతో షాకైన పైలట్లు అప్రమత్తమై.. వేగంగా విమానాన్ని మళ్లీ గాల్లోకి లేపారు.
 
పైలెట్ జాగ్రత్తగా వ్యవహరించడంతో ఇండిగో విమానానికి పెను ప్రమాదమే తప్పింది. దీంతో ప్రయాణికులు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే గాల్లోకి ఎగిరిన విమానాన్ని అధికారులు అటు నుంచి అటే తిరిగి బెంగళూరుకు పంపించారు. కాగా, ఫైరింజన్‌ బోల్తాపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.