ఖమ్మం టిక్కెట్టుకు కాంగ్రెస్ పార్టీలో ఎవరూ నో చెప్పరు.. రేణుకా చౌదరి
ఖమ్మం టిక్కెట్టుకు కాంగ్రెస్ పార్టీలో ఎవరూ నో చెప్పరని రేణుకా చౌదరి విశ్వాసం వ్యక్తం చేశారు. ఖమ్మం నుంచి పోటీ చేయాలని ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీని మనస్ఫూర్తిగా కోరినట్లు ఆమె తెలిపారు. సోనియా తెలంగాణ నుంచి పోటీ చేస్తే చాలా శుభపరిణామం. ప్రస్తుతం ఖమ్మం లోక్‌సభ స్థానం సోనియాగాంధీకి రిజర్వ్ అయిందని, మిగిలినది ఆమె నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఆమె అన్నారు.
ఖమ్మం నుంచి పోటీ చేసే విషయంలో ఎవరు ఎన్ని ప్రచారాలు చేసినా పట్టించుకోలేదని ఆమె కొట్టిపారేశారు. మరో 20 ఏళ్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. తాను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని, ఎస్సీ, ఎస్టీ వర్గాలను కూడా ఢిల్లీకి తీసుకెళ్లానని ఆమె తెలిపారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అక్రమాలపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వీరోచితంగా పోరాడుతున్నారని కొనియాడారు.
భద్రాచలం రామమందిరం సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని రేణుకా చౌదరి అన్నారు. రామాయణంలో ఖమ్మం జిల్లా పాత్ర ఏమిటో తెలియకుండా బీజేపీ మూర్ఖంగా వ్యవహరిస్తోందని ఆమె ఆరోపించారు.