మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 27 మే 2021 (11:35 IST)

29న తిరుపతిలో కొవిడ్‌ నియంత్రణపై సమీక్ష

కొవిడ్‌ నియంత్రణపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ఈ నెల 29న ఉదయం 10 గంటలకు జిల్లా స్థాయి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటుచేసినట్లు కలెక్టర్‌ హరినారాయణన్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

తిరుపతి వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ఆడిటోరియంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎంలు నారాయణస్వామి, ఆళ్లనాని, రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరవుతారని వెల్లడించారు.

వారితో పాటు జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సహా కొవిడ్‌ కోసం నియమించిన నియోజకవర్గ స్థాయి స్పెషల్‌ ఆఫీసర్లు, నోడల్‌ ఆఫీసర్లు, డీఎంఅండ్‌హెచ్‌వో, డీసీహెచ్‌ఎస్‌,  ఎస్పీలు తదితరులు  పాల్గొంటారని ఆయన తెలిపారు.