గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 8 జులై 2019 (08:54 IST)

అదిరిందయ్యా ఆర్కే.. నిగనిగలాడే కారులో ఆర్కే ప్రయాణం

టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై విజయం సాధించి మంచి ఊపుమీదున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ రెడ్డి రానున్న అసెంబ్లీ సమావేశాలకు నిగమిగలాడే కారులో రానున్నారు.
తన హిందూస్తాన్ మోటార్స్ 1972 మోడల్ అంబాసిడర్ నల్లకారును ఈమేరకు శుభ్రంగా కడిగి సిద్ధం చేసుకున్నారు. తనకు నలుపు రంగంటే ఇష్టమని అందుకే తాను వచ్చే అసెంబ్లీ సమావేశాలకు ఈ కారులోనే వస్తున్నానని చెబుతున్నారు. ఆయన మిత్రులు, అభిమానులు మాత్రం అదిరిందయ్యా ఆర్కే అంటున్నారు.