చంద్రబాబు... నీకుంది.. దేర్ ఈజ్ ఎ క్రోకొడైల్ ఫెస్టివల్: రోజా

rk roja
జె| Last Modified సోమవారం, 20 మే 2019 (19:58 IST)
ఏడు విడతల ఎన్నికలు ముగిసిన తరువాత సర్వత్రా ఫలితాలపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఎపిలోని ప్రముఖుల్లో ఎవరు గెలుస్తారు.. ఎవరు ఓడిపోతారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న దానిపైన చర్చ జరుగుతోంది. ఇలాంటి సందర్భంలో వైసిపి మహిళా నేత రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు గారు.. నీకుంది.. దేర్ ఈజ్ ఎ క్రోకొడైల్ ఫెస్టివల్.. ముందుంది ముసళ్ళ పండుగ.. సంబరపడిపోకు.. సంకలు గుద్దుకోకు.. నిన్ను జనం నమ్మలేదు. సీనియర్ రాజకీయ నాయకుడిగా, తలపండిన రాజకీయవేత్తగా ఏం సాధించావు. ఏం ఉపయోగం లేదు. సర్వేలను గుడ్డిగా నమ్మం. ఎవరెన్ని చెప్పినా వైసిపి గెలుపు ఖాయమంటున్నారు రోజా. గెలుపుపై ధీమా టిడిపి నేతల కన్నా మాకే ఎక్కువ ఉందంటున్నారు రోజా.

ఇక తన గెలుపు మామూలేనని, అంతే కాకుండా తనతో పాటు తన స్నేహితులందరూ కూడా గెలుస్తారని, వైసిపి భారీ విజయం సాధిస్తుందన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు రోజా.దీనిపై మరింత చదవండి :