శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 22 మార్చి 2019 (18:46 IST)

నామినేషన్ వేశా.. భారీ మెజారిటీతో గెలుస్తా.. రోజా

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నామినేషన్ల పర్వం ఎపిలో కొనసాగుతోంది. చిత్తూరు జిల్లాలో పలువురు ప్రముఖులు నామినేషన్లను దాఖలు చేశారు. వైసిపి మహిళా నేత, సినీ ప్రముఖరాలు రోజా నగరిలోని తహశీల్ధార్ కార్యాలయంలో నామినేషన్‌ను దాఖలు చేశారు. వేలాదిమంది కార్యకర్తలు, నాయకులతో కలిసి ర్యాలీగా తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్న రోజా రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. 
 
నవరత్నాలతో ప్రజల్లో నమ్మకం ఏర్పడిందని, రాజన్న రాజ్యం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని ఎన్నికలు జరిగిన తరువాత వైసిపి అధికారంలోకి రావడం ఖాయమంటున్నారు రోజా. చంద్రబాబు అంటేనే ప్రజలు విసిగిపోయారని, అవినీతికి బాబు కేరాఫ్ అడ్రస్ అని విమర్శించారు. ఈసారి ఎన్ని జిమ్మిక్కులు చేసినా చంద్రబాబు గెలిచే ప్రసక్తే లేదన్నారు రోజా.