శుక్రవారం, 1 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 9 జనవరి 2021 (18:54 IST)

నవ్వుతూ పండుగ వాతావరణంలో పట్టాలిస్తున్న రోజా

సొంత నియోజకవర్గం నగరిలో బిజీబిజీగా గడుపుతున్నారు రోజా. నియోజకవర్గ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటిని పరిష్కరించడంలో ముందున్నారు రోజా. అంతేకాకుండా రాష్ట్రప్రభుత్వం అందజేస్తున్న నిరుపేదలకు ఇంటిపట్టాల పంపిణీని పండుగ వాతావరణంలో కొనసాగిస్తున్నారు.
 
గత పదిరోజుల నుంచి నియోజకవర్గం నగరిలోని అన్ని మండలాల్లో తిరుగుతూ అర్హులైన వారందరికీ ఇంటిపట్టాలను స్వయంగా రోజా అందజేస్తున్నారు. గ్రామాల్లో తిరుగుతూ అందరితో ఆప్యాయంగా మాట్లాడుతున్న రోజా ఇంటి పట్టాలను అందజేయడమే కాకుండా వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.
 
గతంలో ఏ ప్రభుత్వం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మాదిరిగా ఇంటి పట్టాలు ఇవ్వలేదని.. రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షలకు పైగా ఇంటి పట్టాలను పండుగ వాతావరణంలో అందిస్తున్నట్లు రోజా చెప్పారు. ప్రతిపక్షాలకు అస్సలు పనిలేదని.. ప్రభుత్వాన్ని విమర్సించడమే పనిగా పెట్టుకున్నారంటూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు రోజా.