శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: మంగళవారం, 1 మే 2018 (21:00 IST)

రోజా పెద్ద బఫూన్... మంత్రి కొల్లు రవీంద్ర

వైసిపి ఎమ్మెల్యే రోజా పెద్ద బఫూన్ అంటూ మండిపడ్డారు మంత్రి కొల్లు రవీంద్ర. వైసిపి విజయవాడలో చేసిన దీక్ష మొత్తం నాటకమన్నారు. రోజాకు ఏం తెలుసునని చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని, ఎపిలో జరుగుతున్న అభివృద్ధి రోజాకు కనిపించలేదా అంటూ ప్రశ్నించారు. రోజా న

వైసిపి ఎమ్మెల్యే రోజా పెద్ద బఫూన్ అంటూ మండిపడ్డారు మంత్రి కొల్లు రవీంద్ర. వైసిపి విజయవాడలో చేసిన దీక్ష మొత్తం నాటకమన్నారు. రోజాకు ఏం తెలుసునని చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని, ఎపిలో జరుగుతున్న అభివృద్ధి రోజాకు కనిపించలేదా అంటూ ప్రశ్నించారు. రోజా నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు.
 
నోటికి ఏదొస్తే అది మాట్లాడడం రోజాకు అలవాటుగా మారిపోయిందని, ఆమె ప్రజాప్రతినిధి అన్న విషయం మరిచిపోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అవినీతి, అక్రమాలకు కేరాఫ్‌ చంద్రబాబని రోజా చెప్పడం విడ్డూరంగా ఉందని, ఆర్థిక నేరగాడు ఎవరో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసునని జగన్ ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. 
 
రోజా ఇప్పటికైనా టిడిపి నేతలపై విమర్శలు మానుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు కొల్లు రవీంద్ర. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ దర్శనా సమయంలో దర్సించుకున్నారు మంత్రి కొల్లు రవీంద్ర.