అన్షుమాలిక సినీ రంగ ప్రవేశంపై ఆర్కే రోజా ఏమన్నారు...?
ఏపీ పర్యాటక, క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా కుమార్తె అన్షుమాలిక సినీ రంగంలోకి ప్రవేశిస్తుందని టాక్ వస్తోంది. ఈ వార్తలపై ఆర్కే రోజా స్పందించారు. యాక్టింగ్ కెరీర్ ఎంచుకోవడం తప్పు అని ఎప్పుడూ అననని చెప్పారు. తన కూతురు, కుమారుడైతే యాక్టింగ్ చేయాలని సినిమా ఇండస్ట్రీకి వస్తే ఎంతో హ్యాపీగా ఫీలవుతానని తెలిపారు.
తన కుతూరుకి బాగా చదువుకోవాలని సైంటిస్ట్ అవ్వాలనే ఆలోచన వుందని చెప్పారు. తను బాగా చదువుకుంటోందని.. ఇప్పటివరకైతే తనకు సినిమాల్లోకి వచ్చే ఆలోచన లేదని వెల్లడించారు. ఒకవేళ తను సినిమాల్లోకి వస్తే మాత్రం ఓ తల్లిగా ఆశీర్వదిస్తానని.. అండగా నిలబడతానని చెప్పారు.
ఇకపోతే.. చదువుల్లో ముందున్న అన్షుమాలిక చిన్నవయసులోనే సామాజిక సేవల పట్ల ఆకర్షితురాలై ఓ స్వచ్ఛంద సంస్థకు సహాయసహకారాలు అందిస్తోంది.