బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 డిశెంబరు 2021 (09:34 IST)

మృత్యుఒడిలోకి చేరేందుకు గంట ముందు కుటుంబ సభ్యులకు సాయితేజ ఫోన్

భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్‌కు వ్యక్తిగత భద్రతా అధికారిగా ఉన్న చిత్తూరు జిల్లాలోని ఎగువరేగడి గ్రామానికి చెందిన బి.సాయితేజ ఇంట్లోనూ, గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. తమిళనాడులో బుధవారం జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో మృత్యువాతపడిన వారిలో సాయితేజ ఒకరు. 
 
ఈయన మృత్యుఒడిలోకి చేరుకునేందుకు గంట ముందు తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సంతోషంగా మాట్లాడారు. ఈ విషయాన్ని తలచుకుని సాయితేజ భార్యాపిల్లలు, కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. బోరున విలపిస్తున్నారు. వారిని ఓదార్చడం ఎవరివల్లా కావడం లేదు. అలాగే, గ్రామమంతా విషాదచాయలు అలముకున్నాయి. 
 
సాయితేజకు జిల్లాలోని కురబలకోట మండలం ఎగువ రేగడి గ్రామం. ఈ ప్రమాదం జరగడానికి ముందు సాయితేజ తన భార్య శ్యామలకు వీడియోకాల్ చేసి మాట్లాడారు. ఆ తర్వాత ఆయన కొద్దిసేపటికే మృత్యుఒడిలోకి జారుకున్నారు. కాగా, ఈ హెలికాఫ్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ దంపతులు, సాయితేజతో పాటు.. మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. హెలికాఫ్టర్ కెప్టెన్ వరుణ్ సింగ్ మాత్రం 80 శాతం కాలిన గాయాలతో ఆర్మీ  ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.