మంగళవారం, 21 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 19 సెప్టెంబరు 2025 (10:41 IST)

బంగాళాఖాతంలో అల్పపీడనం: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. పిడుగులు పడే అవకాశం

Telangana Rains
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఏపీలోని కాకినాడ, కోనసీమ, ప్రకాశం, నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరం, తిరుపతి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. భారీ వర్షాలు ఉండటంతో హెచ్చరికల దృష్ట్యా ప్రజలు సురక్షితంగా ఉండాలని అధికారులు వెల్లడించారు. 
 
ముఖ్యంగా పిడుగులు పడే సమయంలో చెట్లు, పంట పొలాలు, విద్యుత్ స్తంభాలు, సెల్ ఫోన టవర్ల దగ్గర ఉండకూడదని అధికారులు సూచిస్తున్నారు. ఏపీలో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో అధికారులు బిగ్ అలర్ట్ విధించారు. మిగతా జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 
 
తెలంగాణలో ఆదిలాబాద్, వరంగల్, రంగారెడ్డి, ఖమ్మం, మెదక్, నిజామాబాద్, పెద్దపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.