బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: విజయవాడ , సోమవారం, 20 సెప్టెంబరు 2021 (15:41 IST)

శ్రీవారికి నాసి ర‌కం జీడిప‌ప్పు స‌ర‌ఫ‌రా... టీటీడీ వేటు వేసేనా?

అలిపిరి టీటీడీ వేర్‍హౌస్ కేంద్రంగా భారీ గోల్‍మాల్ జరిగినట్లు శ్రీవారి భ‌క్తులు ఆరోపిస్తున్నారు. శ్రీవారి ప్రసాదాలకు కాంట్రాక్టర్ నాసి రకం జీడిపప్పును అంట గట్టెందుకు యత్నించినట్లు సమాచారం. బెంగళూరుకు చెందిన హిందుస్తాన్ ముక్తా కంపెనీ గత కొద్దీ నెలలుగా పాడైపోయిన జీడిపప్పును పంపుతోంది. అయితే జీడిపప్పు నాసిరకంగా ఉందని టీటీడీ అధికారులు 10 లోడ్లను వెనక్కు పంపించారు.
 
టీటీడీ అధికారులు తిప్పి పంపించిన జీడిపప్పునే మళ్లీ ప్యాకింగ్ మార్చి హిందుస్తాన్ ముక్తా కంపెనీ పంపుతోంది. నిత్య అన్నదానం, తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయానికి కూడా నాసిరకం జీడిపప్పునే ఆ సంస్థ పంపుతోంది. సరఫరా సంస్థతో మార్కెటింగ్ విభాగంలో కొందరు ఉద్యోగులు కుమ్మక్కయినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. పురుగుపట్టిన జీడిపప్పు సరఫరాపై టీటీడీ అధికారులు సీరియస్‍గా స్పందించారు. విజిలెన్స్ విభాగంతో విచారణ చేయించారు. విజిలెన్స్ నివేదిక మేరకు కాంట్రాక్టర్‌తో పాటు ఇంటి దొంగలపై చర్యలు తీసుకునేందుకు టీటీడీ అధికారులు సిద్ధమవుతున్నారు.