గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , బుధవారం, 15 సెప్టెంబరు 2021 (11:00 IST)

క్యాప్, జుత్తుకు పిల‌క‌, ర‌బ్బ‌ర్ బ్యాండ్... సింగరేణి నిందితుని వివరాలివి

ప‌సిపాప‌ను అమానుషంగా చంపేసిన సింగ‌రేణి నిందితుడు రాజు ఎక్క‌డ క‌నిపించినా వెంట‌నే పోలీసుల‌కు తెలియ‌జేయండి. సైదాబాదులోని సింగ‌రేణి కాల‌నీలో ద‌ళిత బాలిక‌పై హ‌త్యాచారం చేసిన ఈ నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇత‌న్ని ప‌ట్టుకుంటే, ఆచూకీ తెలిపితే, 10 ల‌క్ష‌ల రూపాయ‌లు బ‌హుమానం కూడా ఇస్తామ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. 
 
సింగ‌రేణి నిందితుడు ఎత్తు-- సుమారుగా 5.9 అడుగులు ఉంటుంది. అత‌డి జుట్టు--   దేవుని మొక్కు కోసం పెంచిన‌ట్లు, పిలక రబ్బర్ బ్యాండ్ తో ముడి వేయబడి ఉంటుంది. అతని మెడలో ఎర్రని కండవా, త‌ల‌పై  క్యాప్ ధరించి ఉంటాడు. అతని రెండు చేతుల మీద మౌనిక అని టాటూ మార్క్ చేయబడి ఉంటుంది. అతనికి గడ్డం గవద వద్ద మాత్రమే ఉంటుంది. రాజు ఫార్మల్ చొక్కా, ఫార్మల్ పాయింట్ ధరించి ఉంటాడు. ఇత‌గాడి ఆచూకి తెలిస్తే, వెంట‌నే ద‌గ్గ‌రిలోని పోలీస్ స్టేష‌న్ కు స‌మ‌చారం అందించండి.