అమావాస్య రోజున మద్యంతో అభిషేకం.. తాంత్రిక పూజలు చేశారా?

Last Updated: శనివారం, 8 డిశెంబరు 2018 (10:36 IST)
విశాఖపట్నం సింహాచలం క్షేత్రపాలకుడిగా ఉన్న భైరవస్వామి ఆలయంలో ఇద్దరు ఆలయ పూజారులు స్వయంగా ఈ తాంత్రిక పూజల్ని నిర్వహించినట్లు తెలుస్తోంది. గురువారం అమావాస్య రోజు కావడంతో అర్థరాత్రి ఆలయ ఈవో ఆదేశాల మేరకు ఈ క్రతువును నిర్వహించినట్లు సమాచారం. అడవివరానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయంలో వుంది. 
 
ఈ స్వామికి కొందరు అర్చకులు అమావాస్య రోజున మద్యంతో అభిషేకం నిర్వహించడంతో ఇక్కడ క్షుద్రపూజలు చేసివుంటారని స్థానిక ప్రజలు అనుమానిస్తున్నారు. అయితే అర్చకులు మాత్రం ఈవో ఆదేశాల మేరకు ఈ పూజలు నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. దీనిపై మరింత చదవండి :