Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శిరీషతో హ్యాపీగా ఉన్నా.. నా భార్య క్యారెక్టర్‌పై నిందలొద్దు.. రోజూ మీడియాలో?: సతీష్ చంద్ర

శనివారం, 1 జులై 2017 (12:53 IST)

Widgets Magazine

హైదరాబాద్ ఫిల్మ్ నగర్, ఆర్జే స్టూడియోలో పనిచేస్తూ ఆత్మహత్యకు పాల్పడిన బ్యూటీషియన్ శిరీష కేసు మిస్టరీని తలపిస్తోంది. అయితే శిరీష భర్త మాత్రం తన భార్య క్యారెక్టర్‌పై లేనిపోని నిందలు వేయొద్దంటున్నారు. తన భార్య అయిన శిరీషతో తాను చాలా హ్యాపీగా ఉండేవాడినని భర్త సతీష్ చంద్ర అన్నారు. 
 
ఆర్జే స్టూడియోలో మాత్రమే శిరీష పనిచేయలేదని.. బెంగళూరుకు చెందిన గెట్ లుక్ సర్వీసెస్ అనే ఆన్ లైన్ బ్యూటీ సర్వీసెస్‌లో కూడా శిరీష పార్ట్ టైమ్‌గా పనిచేసిందని సతీష్ చంద్ర చెప్పారు. దాదాపు ఏడాది నుంచి బెంగళూరు సంస్థలో ఆమె పనిచేస్తుందని.. నెలకు 30 నుంచి 40వేల వరకు డ్రా చేసేదని.. తాను నెలకు 15-20 వేల దాకా సంపాదించే వాడినని.. అయినప్పటికీ తమ మధ్య ఈగో సమస్యలు రాలేదని.. హ్యాపీగా ఉండేవాళ్లమని సతీష్ చంద్ర చెప్పుకొచ్చారు. ఆర్జే స్టూడియోలో చేరి ఆరునెలలు అయ్యిందన్నారు.
 
ఈ కేసును ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిదని.. రోజూ మీడియాలో శిరీషను చూపించి.. ఆమె క్యారెక్టర్‌పై నిందలేస్తున్నారని సతీష్ చంద్ర వాపోయారు. తమ ఇద్దరి మధ్య ఎటువంటి సమస్యలూ లేవని అన్నారు. తమది పెద్దలు కుదిర్చిన వివాహమేనని చెప్పుకొచ్చారు. తాను ఎన్జీవో సంస్థ ఆశ్రే ఆకృతిలో పనిచేస్తుంటానని, చెవిటి, మూగ పిల్లలకు తాను వంట చేసి పెడతానన్నారు. శిరీషది ఆత్మహత్య కాదని.. ఆమెను హత్య చేశారని సతీష్ చంద్ర విమర్శించారు. ఈ కేసుపై స్పెషల్ ఎక్వైరీ జరిపించాలని సతీష్ చంద్ర డిమాండ్ చేశారు.

శిరీషను హత్య చేసిన తర్వాతే హైదరాబాదుకు తీసుకొచ్చారని, ఆమె ప్రమాదంలో ఉండటంతోనే రెండుసార్లు లొకేషన్ తనకు షేర్ చేసిందని సతీష్ చంద్ర అన్నారు. రాజీవ్, శ్రవణ్‌ల నుంచి నిజాన్ని ఎందుకు రాబట్టలేదని సతీష్ చంద్ర ప్రశ్నిస్తున్నారు. కుకునూర్‌పల్లి సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడం ఆశ్చర్యంగా ఉందని సతీష్ చంద్ర తెలిపారు. పోలీసులు కెమెరా విజువల్స్ ఉన్నాయని చెప్పినా వాటిని ఎందుకు రిలీజ్ చేయలేదని సతీష్ చంద్ర ప్రశ్నించారు. క్యారెక్టర్ మీద ఫోకస్ ఆపేసి.. క్రైమ్ మీద ఫోకస్ పెట్టండంటూ సతీష్ చంద్ర అన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Sirisha Husband Sravan Rajeev Tejaswini Satish Chandra Suicide Case Si Prabhakar Reddy

Loading comments ...

తెలుగు వార్తలు

news

విమానం టాప్ నుంచి నీళ్లు కారితే పరిస్థితి ఎలా ఉంటుంది? (video)

బస్సుల్లో వెళ్ళేటప్పుడు వర్షం పడితే ఆ నీరు టాప్ నుంచి బస్సులోనికి రావడం చూసేవుంటాం. అయితే ...

news

ఫేస్‌బుక్ పరిచయం.. యువకుడిని హతమార్చి.. నగదుతో ఉడాయించిన యువతి..

ఫేస్‌బుక్ మోసాలు పెరిగిపోతున్నాయి. ఫేస్‌బుక్‌లో గుర్తు తెలియని వ్యక్తులను పరిచయం ...

news

షాకింగ్... తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టుకు నరబలి...?

నరబలి అనే మాట వింటేనే వళ్లు గగుర్పొడుస్తుంది. ఈ నరబలి అనే మాటను ఇదివరకటి బ్లాక్ అండ్ వైట్ ...

news

టూరిస్ట్ సెల్ ఫోన్‌ లాక్కుని సెల్ఫీ తీసుకున్న కోతి.. ఎక్కడో తెలుసా?

పర్యాటకుల పుణ్యమా అని జూలోని జంతువులు కూడా సెల్ఫీలకు అలవాటుపడినట్లున్నాయి. తాజాగా ...

Widgets Magazine