మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 24 మే 2021 (11:07 IST)

రెమ్‌డెసివిర్‌ ఖాళీ సీసాల్లో స్లైన్‌ నీళ్లు... ముగ్గురి అరెస్టు

రెమ్‌డిసివర్ ఖాళీ సీసాల్లో స్లైన్ నీళ్లు పోసి విక్రయిస్తున్న ముగ్గురి సభ్యుల ముఠాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టాస్క్‌ఫోర్స్‌ అధికారులు అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
విజయవాడ దుర్గాపురానికి చెందిన కిశోర్‌ (39) అనే వ్యక్తి సూర్యారావుపేటలోని ఒక ప్రైవేటు దవాఖానలో మత్తుమందు టెక్నీషిన్‌గా పనిచేస్తున్నాడు. అక్కడ రోగులకు వినియోగించిన రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్ల ఖాళీసీసాలను సేకరించి.. వాటిలో స్లైన వాటర్‌ నింపి నకిలీవి తయారుచేశాడు. 
 
వాటిని డోర్నకల్‌ రోడ్డులోని కోన మెడికల్స్‌ నిర్వాహకుడు కటికపూడి సంపత్‌కుమార్‌, గోవిందరాజులు నాయుడు వీధిలోని జయశ్రీ మెడికల్‌ నిర్వాహకుడు పాలడుగుల వెంకట్‌ గిరీశ్‌కు విక్రయించాడు. 
 
గుంటూరుకు చెందిన ఓ కరోనా బాధితుడి బంధువులకు వీరు ఒక్కో ఇంజెక్షన్‌ను రూ.20 వేలకు అమ్మారు. గుంటూరు వైద్యులు వాటిని నకిలీవిగా గుర్తించి.. బాధితుడి బంధువులకు విషయం చెప్పారు. వారి సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వలపన్ని ముగ్గురినీ అరెస్టు చేశారు.