Widgets Magazine

ఫ్రెండ్ అని చనువిస్తే.. ఏం చేశాడో తెలుసా?

శనివారం, 1 జులై 2017 (08:43 IST)

Widgets Magazine
sadist

ఫ్రెండ్ అని చనువిస్తే ప్రియురాలికి కాబోయే భర్తకు అశ్లీల ఫోటోలు పంపించాడు. ఇంతకీ ఈ పాడు పని చేసింది కూడా ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావడం గమనార్హం. ఆ యువతి తనను ప్రేమించకుండా మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక ఈ పాడుపనికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
తెలంగాణ జిల్లా వనపర్తి జిల్లాకు చెందిన పవన్ కుమార్.. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. కొన్నేళ్ళ క్రితం స్థానికంగా ఉండే ఓ ఇంజనీరింగ్‌ కళాశాలలో విద్యనభ్యసించాడు. అతడిది మెకానికల్‌ బ్రాంచ్. అదే కాలేజీలో ఐటీ బ్రాంచకు చెందిన యువతితో అతడికి పరిచయం ఏర్పడింది. ప్రేమ, పెళ్లంటూ వెంటపడటంతో ఆమె అతడిని దూరం పెట్టింది. ఇంజనీరింగ్‌ పూర్తయిన తర్వాత ఇద్దరూ వేర్వేరు కంపెనీల్లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా చేరారు. ఆ యువతికి వేరే వ్యక్తితో ఇటీవల పెళ్లి కుదిరింది. 
 
ఈ విషయం తెలుసుకున్న పవన్.. ఆమెకు ఫోన్ చేసి ప్రేమించాలని వేధించాడు. అసభ్యకర సందేశాలు పంపి బెదిరింపులకు దిగాడు. స్పందన రాకపోవడంతో ఆమె పెళ్లిని చెడగొట్టేందుకు ఈ దారుణాలకు తెగబడ్డాడు. ఆమె ఫేస్‌బుక్‌ ఖాతాను హ్యాక్‌ చేసి.. తామిద్దరూ కలిసి దిగిన ఫొటోలు, అసభ్యకర సందేశాలు, అశ్లీల ఫొటోలు, వీడియోలను ఆమెను చేసుకోబోయే వ్యక్తికి పంపాడు. తనను ప్రేమించకపోతే ఫొటోలను అశ్లీలంగా కనిపించేలా మార్ఫింగ్‌ చేసి వెబ్‌సైట్లలో పోస్ట్‌చేస్తానంటూ బెదిరింపులకు గురిచేశాడు.
 
దీంతో ఈ వేధింపులను భరించలేదని ఆ బాధితురాలు.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. పవన్‌ కుమార్‌ను అరెస్టు చేశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

చరిత్ర పాఠాలు నేర్చుకోవడానికి ఇది 1962 కాదు., చైనా హెచ్చరికపై జైట్లీ ధ్వజం

చరిత్రనుంచి పాఠాలు నేర్చుకోవడానికి ఇది 1962 కాదు 2017 అని గుర్తుంచుకో చైనా అంటూ భారత ...

news

జీఎస్టీపై ఎవరేమన్నారు? జీఎస్టీని వ్యతిరేకిస్తూ దేశంలోని పలు రాష్ట్రాల్లో వ్యాపారాలు బంద్

శుక్రవారం అర్థరాత్రి తర్వాత ఆరంభమైన జీఎస్టీకి వ్యతిరేకంగా శుక్రవారం ఉదయం నుంచి ...

news

గుడ్‌మార్నింగ్‌ ఇండియా... ఒక దేశం ఒకే పన్ను నినాదంతో దేశాన్ని పలుకరించిన జీఎస్టీ..

దాదాపు 17 సంవత్సరాలుగా భారత పన్నుల వ్యవస్థ ఆశించిన కల ఎట్టకేలకు సాకారమైంది. ఒక దేశం ఒకే ...

news

రోజు మనం ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాలి.. సామరస్యంతో కలిసిపోదామన్న వైఎస్ జగన్

వివాదాలను పరిష్కరించడంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కొత్త బాట పడుతున్నారా? గరగపర్రులో ...