గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 13 డిశెంబరు 2019 (10:17 IST)

అందుకే ప్రభుత్వం భయపడుతోంది: సోమిరెడ్డి

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఏ ప్రభుత్వానికైనా, పార్టీకైనా విమర్శలను ఎదుర్కొనే దమ్ముండాలన్నారు. ఏబీఎన్, టీవీ5 ప్రసారాలను మళ్లీ నిలిపివేయడం, వాటితో పాటు ఈటీవీకి అసెంబ్లీ లైవ్ అనుమతి నిరాకరించడం ప్రత్యక్ష కక్ష సాధింపేనన్నారు. 
 
వాస్తవాలు బయటకు వస్తాయనే ప్రభుత్వం భయపడుతోందని, అందుకే అనుమతి ఇవ్వనట్టు కనిపిస్తోందన్నారు. నిషేధం విధించినంత మాత్రాన నిజాలను బయటకు రాకుండా ప్రభుత్వం ఆపలేదని అన్నారు. ప్రభుత్వ చర్యలు ప్రజాస్వామ్యాన్ని ప్రత్యక్షంగా ఖూనీ చేయడమేనన్నారు. గత ఐదేళ్లలో సాక్షి బరితెగించి రాతలు రాసిందని, ఇప్పుడు సాక్షి రాసేది తప్పులని సీఎం జగన్ సెలవిస్తున్నారని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు.