సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 19 ఏప్రియల్ 2021 (17:31 IST)

బస్తీమే సవాల్.. దమ్ముంటే రాజీనామా చెయ్... కాకానికి సోమిరెడ్డి ఛాలెంజ్

నెల్లూరు జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ జిల్లాకు చెందిన అధికార వైకాపాకు చెందిన ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఇదే అంశంపై ఆయన సోమవారం నెల్లూరులో మాట్లాడుతూ, తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ని ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి నోటికొచ్చినట్లుగా మాట్లాడారని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్స్యకారేతర ప్యాకేజ్ రూ.44 కోట్లు మంజూరు చేసింది వాస్తవమేనని... మూడు విడతలుగా విడుదల చేస్తామని జీవోలో ఉందన్నారు. 

తొలి విడతగా రూ.14 కోట్లు విడుదల అయిందని... జీవో కాపీలో స్పష్టంగా ఉందన్నారు. నిధుల విడుదల నిజమే అయితే కాకాని రాజీనామా చేస్తానన్నానని.. దమ్ముంటే రాజీనామా చెయ్యాలని సవాల్ విసిరారు. కాకాని లాగా నకిలీ పత్రాలు కావన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో అన్నారు. ఎన్నికల కోడ్ పేరుతో మత్స్యకారుల నిధుల పంపిణీని కాకాని అడ్డుకున్నారని సోమిరెడ్డి పేర్కొన్నారు.