మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 18 మార్చి 2022 (16:45 IST)

ఆ కంపెనీలన్నీ వైసీపీ మంత్రులవే.. సోమిరెడ్డి ఫైర్

ఏపీలో మద్యం తయారు చేస్తున్న కంపెనీలన్నీ వైసీపీ మంత్రులు, ఎంపీలు, నేతలవేనని టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. 
 
డబ్బులు దోచుకోవడం కోసొమే ముఖ్యమంత్రి జగన్ ఊరూపేరూ లేని కల్తీ మద్యాన్ని విక్రయిస్తున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. 
 
కల్తీ సారాను విక్రయిస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తున్నారని విమర్శించారు. జనాలు చనిపోతున్నా పట్టించుకోవడం లేదని... తనకు రావాల్సిన సొమ్ము వస్తే చాలనే విధంగా ఆయన వ్యవహారశైలి ఉందని దుయ్యబట్టారు. నాసిరకం మద్యాన్ని అమ్మడం వల్ల ప్రతి ఏటా రూ. 5 వేల కోట్లను దండుకుంటున్నారని ఆరోపించారు. 
 
జంగారెడ్డిగూడెంలో 28 మంది ప్రాణాలు కోల్పోక ముందే అక్కడున్న నాటుసారా నిల్వలను నాశనం చేసి ఉండాల్సిందని సోమిరెడ్డి అభిప్రాయపడ్డారు.