Widgets Magazine

హోదాకు, ప్యాకేజీకి మధ్య రూ.3వేల కోట్లే తేడా.. బాబే అలా?: సోమువీర్రాజు

తెలుగుదేశం పార్టీకి బీజేపీ మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. సీఎం చంద్రబాబుపై బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రత్యేక హోదాతో ఒరిగేదేమీలేదని టీడీపీ సమావేశంలో చంద్రబాబు అన్న మాటన

somu veerraju
selvi| Last Updated: శుక్రవారం, 23 ఫిబ్రవరి 2018 (11:56 IST)
తెలుగుదేశం పార్టీకి బీజేపీ మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. సీఎం చంద్రబాబుపై బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రత్యేక హోదాతో ఒరిగేదేమీలేదని టీడీపీ సమావేశంలో చంద్రబాబు అన్న మాటను సోమువీర్రాజు గుర్తు చేశారు. హోదా అంటే జైలుకేనని చంద్రబాబే స్వయంగా చెప్పారని.. ప్రస్తుతం ఎవరు జైలుకు వెళ్ళాలో చెప్పాలని సోమువీర్రాజు డిమాండ్ చేశారు.

హోదా ఇచ్చిన ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి జరగలేదని చంద్రబాబే స్వయంగా చెప్పారనే విషయాన్ని గుర్తు చేషారు. హోదాకు, ప్యాకేజీకి మధ్య రూ.3వేల కోట్లే తేడా అని చంద్రబాబు అనలేదా అంటూ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీని ప్రశ్నించకూడదని... చంద్రబాబునే అడగాలని సోమువీర్రాజు వ్యాఖ్యానించారు.

పోలవరం వద్దని తెలంగాణ ఎంపీలు నిరసన చేస్తే, ఏపీ టీడీపీ ఎంపీలు ఏం చేయలేకపోయారని సోమువీర్రాజు విమర్శించారు. ఏపీకి ఏం కావాలో అడగకుండా పార్లమెంట్‌లో సీఎం రమేష్‌, సుజనా సమన్యాయం కావాలన్నారని సోమువీర్రాజు శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆరోపించారు.


దీనిపై మరింత చదవండి :