బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Updated : శనివారం, 19 సెప్టెంబరు 2020 (22:25 IST)

నాడు సోనియా, వైఎస్ కూడా డిక్లరేషన్ సమర్పించలేదు: వైవి సుబ్బారెడ్డి

శ్రీవారి ఆలయంలో శాస్రోక్తంగా ధ్వజారోహణం కార్యక్రమం జరిగింది. ధ్వజస్తంభంపై వేదమంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ కంకణధారుడు గోవిందచార్యలు గరుడపఠాని ఎగురవేశారు. ఇక బ్రహ్మోత్సవాలు నిర్వహణకు సంబంధించి కంకణధారణ ఇఓ సింఘాల్ చేశారు. ఆగమశాస్త్రబద్దంగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమైయ్యాయని తి.తి.దే పాలకమండలి  చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు.
 
అనంతరం మీడియా సమావేశంలో సుబ్బారెడ్డి మాట్లాడుతూ యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ, రాజశేఖర్ రెడ్డి  ముఖ్యమంత్రి హోదాలో శ్రీవారి దర్శన సమయంలో ఎటువంటి డిక్లరేషన్ ఇవ్వలేదు. అదేవిధంగా సియం హోదాలో సియం జగన్ పట్టు వస్త్రాలును సమర్పించడానికి విచ్చేసిన సమయంలో డిక్లరేషన్ ఇవ్వనవసరంలేదు అని మాత్రమే నేను అన్నాను. 
అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వకూడదు అని నేను పేర్కోనలేదు.
 
సర్వదర్శనం క్యూలైనులో అన్యమతస్తులను గుర్తించడం సాధ్యం కాదు అని మాత్రమే అన్నాను. తిరుమలలో రాజకీయం చెయ్యడం నాకు చేత కాదు. రూల్ నెంబర్ 137 ప్రకారం హిందువులు మాత్రమే దర్శనానికి అర్హులు. ఇతర మతస్తులు డిక్లరేషన్ సమర్పించిన అనంతరమే దర్శనానికి అనుమతించాలని వుంది. 2014లో అన్యమస్తుతులను టిటిడిని గుర్తిస్తే డిక్లరేషన్ కోరాలని ప్రభుత్వం మెమో జారి చేసింది.
 
వైఎస్ జగన్ ప్రతిపక్ష నాయకుడి హోదాలో పాదయాత్ర మొదలు పెట్టకముందు... ముఖ్యమంత్రిగా భాధ్యతలను స్వీకరించే ముందు శ్రీవారిని దర్శించుకున్నారు. గత ఏడాది సియం హోదాలో వైఎస్ జగన్ పట్టువస్త్రాలను సమర్పించారు. సియం జగన్‌కి వున్న భక్తి భావం చెప్పడానికి ఇవి చాలావా అన్నారు. కేవలం అన్యమతం, డిక్లరేషన్ విషయంలో నేను చెప్పిన వ్యాఖ్యలు మీడియా వక్రీకరించింది అన్నారు.