శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వి
Last Modified: శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (12:50 IST)

ఎస్పీ బాలు మన మధ్యకు తిరిగి రావాలి, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమించిందనే వార్తతో అందరూ ఆందోళనకు గురవుతున్నారు. చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో బాలు వెంటిలేటర్ పైన ఉన్నారు.
 
ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని త్వరలో సంపూర్ణ ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి ఆయన విడుదలవుతారనే వార్తలతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్న వేళ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడం అందరి మధ్య ఆందోళనను కలిగిస్తున్నాయి. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థిస్తున్నారు.
 
బాలు త్వరగా కోలుకోవాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆకాంక్షించారు. తన గానామృతంతో సంగీత ప్రియులను అలరించారు. ఎందరో అభిమానుల మనస్సులో గాఢంగా హత్తుకొని పోయారు. ఆయురారోగ్యాలతో మన ముందు బాలు తిరిగిరావాలని కోరుకుంటున్నానని ఆయన ట్వీట్ చేసారు.