ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (08:52 IST)

శివరాత్రి స్పెషల్: శ్రీశైలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

ఈ నెల 21న మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని తెలంగాణ ఆర్టీసీ సమాయత్తం అవుతోంది. హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి 315 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించుకున్నట్లు రంగారెడ్డి ఆర్​ఎం వరప్రసాద్ తెలిపారు.

ఈ నెల 18 నుంచి 23వరకు బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని సూచించారు. మహాశివరాత్రి నేపథ్యంలో శ్రీశైలానికి వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.

ఈ సంవత్సరం హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి 315 ప్రత్యేక బస్సులు సిద్ధం చేసినట్లు తెలిపారు. 18వ తేదీ నుంచి 23 వరకు బస్సులను నడపనున్నట్లు వెల్లడించారు.

ఎంజీబీఎస్‌, కేపీహెచ్‌బీ, జేబీఎస్‌, మియాపూర్‌, నేరెడ్‌మెట్‌, ఉప్పల్‌, వనస్థలిపురం, ఐఎస్‌ సదన్‌ నుంచి ఈ బస్సులు అందుబాటులో ఉండునున్నట్లు పేర్కొన్నారు. రద్దీకి అనుగుణంగా మరిన్ని ప్రత్యేక బస్సులను పెంచనున్నట్లు వివరించారు.