ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 నవంబరు 2021 (19:48 IST)

అసెంబ్లీలో కునుకు తీసిన పేర్నినాని.. వీడియో వైరల్

ఏపీ మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర కేబినెట్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం నేపధ్యంలో మూడు రాజధానుల చట్టం ఉపసంహరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది జగన్ ప్రభుత్వం. 

అసెంబ్లీ మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ జరుగుతున్న సమయంలో కీలక అంశాలను మంత్రి బుగ్గన స్పీకర్‌కు తెలుపుతుండగా.. వెనుకాల కూర్చున్న మంత్రి పేర్ని నాని నిద్రపోయిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
 
మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ దేశంలోనే సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో ఈ బిల్లు ప్రవేశపెట్టిన బుగ్గన చెప్తున్న స్పీచ్ సమయంలో పేర్ని నాని కునుకు తీయటం విమర్శలకు దారితీస్తుంది. 
 
ఇంత సీరియస్ మ్యాటర్ గురించి చర్చ జరుగుతుంటే.. మంత్రి  హోదాలో ఉన్న పేర్నినాని పడుకున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  పేర్నినాని తూలి పడబోవటం దానిని కవర్ చేయటానికి ఆయన చేసిన ప్రయత్నాలన్నీ రికార్డ్ అవ్వటం.. అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.