శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 27 ఫిబ్రవరి 2020 (11:02 IST)

పోలీస్ కమిషనర్‌ వద్దకు శ్రీరెడ్డి.. హత్యా బెదిరింపులతో..

క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో వెండితెరకు వణుకు పుట్టించిన శ్రీరెడ్డి.. తాజాగా ఈ భామ హత్యా బెదిరింపులతో మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా శ్రీరెడ్డి బుధవారం చెన్నై పోలీస్ కమిషనర్ ఆఫీస్‌లో ప్రత్యక్షమై కరాటే కళ్యాణి, డాన్య మాస్టర్ రాజేష్‌లపై ఫిర్యాదు చేసింది. 
 
వీళ్లిద్దరు.. కొన్ని రోజుల క్రితం శ్రీరెడ్డిపై  కరాటే కళ్యాణి, డాన్స్ మాస్టర్ రాజేశ్ తెలంగాణ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో వీళ్లు శ్రీరెడ్డి తమ గురించి అనరాని మాటలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందని కంప్లట్ చేసారు.
 
దీన్ని తెలంగాణ పోలీసులు చెన్నై క్రైమ్ బ్రాంచ్‌కు ఈ కంప్లైంట్‌ను  ట్రాన్స్‌ఫర్ చేసారు. ఈ పరిస్థితుల్లో నటి శ్రీరెడ్డి.. కరాటే కళ్యాణి, డాన్స్ మాస్టర్ రాకేష్‌లపై చెన్నై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది.