బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 7 మార్చి 2021 (12:59 IST)

ఆస్తి కోసం తోడబుట్టిన వారిని హతమార్చిన తమ్ముడు

ఆస్తి వివాదంతో ఓ వ్యక్తి తోడబుట్టిన వారినే తెగనరికాడు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం రామచంద్రాపురంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురి చేసింది. గ్రామానికి చెందిన సన్యాసిరావు ఎప్పటిలాగే ఆదివారం ఉదయం పశువుల శాలలో పాలు తీస్తుండగా.. వెనుక నుంచి వచ్చిన తమ్ముడు రామకృష్ణ కత్తితో నరికాడు. 
 
సమీపంలో ఉన్న అక్క జయమ్మ ఆందోళనతో అక్కడికి రాగా.. ఆమె పైనా వేటు వేశాడు. రక్తపు మడుగులో కుప్పకూలిపోయిన ఆ ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనతోపాటు అందుకు దారి తీసిన పరిస్థితులపై పోలీసులు విచారణ చేపట్టారు. మృతులను రామచం‍ద్రాపురం గ్రామానికి చెందిన గొర్లె రామకృష్ణ అనే వ్యక్తి తన సొంత అక్క జయమ్మ, అన్న సన్యాసి రావులుగా గుర్తించారు. 
 
భూవివాదాల‌ కార‌ణంగా వారి మ‌ధ్య కొంత కాలంగా విభేదాలు రాజుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే సొంత అక్క‌, అన్నపై రామ‌కృష్ణ ప‌గ పెంచుకుని ఈ దారుణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.