శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 సెప్టెంబరు 2023 (21:42 IST)

గోవిందరాజుల గుట్టపై శ్రీవారి పాద ముద్రిక.. నామం దిద్ది పూజలు..

venkateswara swamy
తిరుమల తిరుపతి కొండపై వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామికి సంబంధించిన ఎన్నో విశేషాలు తిరుమల పరిసర ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. తాజాగా చిత్తూరు జిల్లాలో శ్రీవారి పాద ముద్ర ఆనవాలు కనిపించాయి. 
 
వివరాల్లోకి వెళితే.. చిత్తూరు రూరల్ మండలంలోని తాళంబేడు పంచాయతీ టి.వేనపల్లె సమీపంలోని ఓ గుట్టకు ఉంది. ఆ గుట్టను అందరూ గోవిందరాజుల గుట్ట అని పిలుస్తుంటారు. రెండ్రోజుల క్రితం ఆ గుట్టలో శ్రీవారి పాద ముద్రిక దర్శనమిచ్చింది.
 
చిత్తూరు-తచ్చూరు హైవే కాంట్రాక్టర్ మట్టి కోసం ఈ గుట్ట సమీపంలో తవ్వుతున్నాడు. ఇదే సమయంలో స్థానికులు కూడా ఆ మట్టి పనులను పరిశీలించేందుకు అక్కడకు వెళ్లారు. ఈ క్రమంలో మట్టి తవ్వుతుండగా శ్రీవారి పాద ముద్ర కనిపించింది. దీంతో ఆ గుట్టలో శ్రీవారి పాదముద్ర ఉందంటూ స్థానికులు ఆ గుట్టకు నామాలు దిద్ది పూజలు చేశారు. 
 
ప్రస్తుతం తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలోనే పాదం ఆనవాలు కనిపించడంపై స్థానికంగా చర్చ జరుగుతోంది. ఇది అంతా వెంకటేశ్వరస్వామి మహిమ అంటున్నారు.